Webdunia - Bharat's app for daily news and videos

Install App

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

దేవీ
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (18:44 IST)
A 22, A 26 news\
‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఇటీవలే ప్రకటించింది సన్ పిక్చర్స్. అల్లు అర్జున్ కు 22, అట్లీకి 26వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం జూన్ లో సెట్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం టెక్నికల్, విజువల్ ఎఫెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్ష న్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికాలో పలు టెక్నికల్ టీమ్ ను కలిసి వచ్చిన అర్జున్, అట్లీ హాలీవుడ్ హిట్ సినిమాలకు పనిచేసిన వారితో చర్చించి వచ్చారు.
 
అట్లీ సినిమా అంటేనే యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో వుంటుందని అభిమానులకు తెలిసిందే. ఈ సినిమా కూడా అలానే వుంటుందనే టాక్ కూడా వుంది. అయితే ఆ యాక్షన్ పార్ట్ కూడా పర్యావనానికి సంబంధించిన అంశంగా వుండబోతోందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో  జీ స్టుడియోస్ కంపెనీ కూడా కాంబినేషన్ లో వుండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ సినిమాలో నాయిక పాత్రలకు కూడా ప్రాధానత్యవుండనున్నదట. అందుకు ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అదీకాకుండా హాలీవుడ్ నటిని కూడా తీసుకునే ఆలోచనలో వున్నట్లు కూడా మరో వార్త వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమా స్థాయిలో వుండడంతో యాక్షన్ పార్ట్ చేయగలిగే నటికి ప్రాధాన్యత వుండనున్నదట. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో  త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments