Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జైలర్‌'కు సీక్వెల్ - గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

Advertiesment
jailer-2 teaser

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (16:43 IST)
యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్‌కు సీక్వెల్ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన విషయాన్ని మంగళవారం రాత్రి ఒక అనౌన్స్‌మెంట్ టీజర్ ద్వారా నిర్మాణ సంస్థ సన్ పిక్సర్స్ అధికారికంగా వెల్లడించింది. 
 
గతంలో వచ్చిన జైలర్ మూవీ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమేకాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
 
'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటులు అతిధి పాత్రల్లో ఆకట్టుకున్నారు. వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో సందడి చేశారు. 
 
ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే మంచి కలెక్షన్లు సాధించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
 
ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా జైలర్-2 రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదలచేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కు జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజరులో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కనిపించడం విశేషం.
 
ఈ మూవీలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. జైలర్ 2లో రజనీకాంత్‌తో పాటు జైలర్ 1లో కనిపించిన ప్రధాన తారాగణం కూడా కొనసాగుతుండటంతో ప్రేక్షకులలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే విపరీతమైన వ్యూస్ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ 'ఓజీ' - నాగ చైతన్య 'తండేల్‌'ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్!!