Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

సెల్వి
శుక్రవారం, 30 మే 2025 (19:19 IST)
Rashmika Mandanna
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ  ప్రేమలో వున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అక్కడక్కడ కలిసి కనిపించడం చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వస్తోంది. తాజాగా రష్మిక మందన్న ఎల్లో శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను అమ్మడు విజయ్ దేవరకొండ ఇంట్లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ ఫోటోలు తనకు నచ్చిన రంగు, వాతావరణం, స్థలం, ఓ అందమైన మహిళ తనకు ఇచ్చిన ఈ చీరతో ఫోటోలు దిగడం సంతోషంగా వుందని చెప్పుకొచ్చింది. 
 
ఈ సంతోషం చూస్తుంటే విజయ్ దేవరకొండ ఇంట్లోనే తీసినవని క్లారిటీ వచ్చేస్తుందని సినీ పండితులు అంటున్నారు. ఇవన్నీ జీవితంలో తనకు అమూల్యమైనవి అంటూ రష్మిక పోస్టు చేసింది. ఈ చీరను విజయ్ దేవర కొండ తల్లి రష్మికకు కానుకగా ఇచ్చివుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
అలాగే నెటిజన్లు రష్మిక కూర్చుని ఫోటోలు దిగిన ప్లేస్ విజయ్ దేవరకొండ ఇళ్లేనని.. ఆమె ఫోటోలో వున్న ప్రాంతం విజయ్ ఇళ్లేనని నెటిజన్లు చెప్పేస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
Rashmika Mandanna
 
పసుపు చీరలో రష్మిక మెరిసిపోతుందని కామెంట్లు వస్తున్నాయి. ఇకపోతే.. రష్మిక, విజయ్ గీతగోవిందం సినిమాలో నటించి హిట్ పెయిర్‌గా మార్కులేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరూ డియర్ కామ్రేడ్‌లో కనిపించారు. ప్రస్తుతం విజయ్ దేవరొకండ కింగ్‌డమ్ చిత్రంలో నటిస్తుండగా, రష్మిక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా చిత్రంలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments