Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

Advertiesment
Dhanush As Deva poster

దేవీ

, శనివారం, 10 మే 2025 (15:55 IST)
Dhanush As Deva poster
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. ధనుష్, నాగార్జున నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ఇదిలా వుండగా, నేటితో ధనుష్ కెరీర్ మొదలుపెట్టి 23 సంవత్సరాలైంది. ఇందులో దేవా గా ధనుష్ నటిస్తున్నాడు. పక్కా మాస్ చిత్రంగా రూపొందుతోంది. భావోద్వేగాలు, డ్రామా, గ్రాండ్ విజువల్స్ కలిగిన మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి స్టార్ తారాగణం ఉంది. 
 
23 సంవత్సరాలుగా నటుడిగా అద్భుతమైన కృషి, అభిరుచి, అంకితభావంతో కూడిన ప్రయాణం స్ఫూర్తినిస్తూనే ఉందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. అయితే, దర్శకుడు కస్తూరి రాజా తన కుమారుడు వెంకటేష్ ప్రభును ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అతని మరో కుమారుడు సెల్వరాఘవన్ రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా, తుళ్ళువాడో ఇలామై అనే చిత్రంతో కొత్త హీరోని ప్రారంభించారు, అతనికి ... ధనుష్ అని పేరు పెట్టారు 
 
ఆ ధనుష్ జాతీయస్థాయి నటుడిగా వెలుగొందాడు. ఇప్పుడు దేవగా  హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవలే  ధనుష్, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయి ట్రెండ్  స్రుష్టిస్తోంది. ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది. అతని గాత్రంలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్‌ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తూ, మాస్ టచ్‌కి తగిన రిథమిక్ మ్యాజిక్‌ ను అందించింది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్‌ గా మలిచింది – ధనుష్ డాన్స్‌లో చూపిన స్పిరిట్, ఎనర్జీ, ఒరిజినాలిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ పాటలో విజువల్స్, వాయిస్, సాహిత్యం, కొరియోగ్రఫీ అన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి.
 
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ Pvt Ltd పతాకాలపై సునీల్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబడింది హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని