నయనతారకు బాగా ఎక్కింది, ఆ హీరో వస్తే కాలు మీద కాలేసుకుని కుర్చీలో నుంచి లేవలేదట...

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:56 IST)
సైరా నరసింహా రెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించింది. ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కాబట్టి చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందోనన్న భయంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు ఎవరికివారు చాలా కష్టపడ్డారు. 
 
ముఖ్యంగా తమన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రమోషన్ కోసం వస్తూ చిత్ర విజయానికి ఎంతో కృషి చేసారని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల జల్లు కురిపించారు. తమన్నా సైరా చిత్రాన్ని తన సొంత చిత్రంగా భావించి ప్రమోషన్ కోసం వచ్చిందంటూ కితాబిచ్చారు. మరో హీరోయిన్ నయనతార గురించి మాత్రం పెదవి విరిచారు. 
 
ఇప్పుడు ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నదేంటయా అంటే... సైరా చిత్రం ప్రమోషన్ కోసం నయనతారను రాంచరణ్ ఎంతగానో బ్రతిమాలాడారట. చిత్రం కమర్షియల్ జోనర్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమోషన్ కి రావాలని విజ్ఞప్తి చేసినా నయనతార ఎంతమాత్రం పట్టించుకోలేదట.
 
పైగా గతంలో బాబు బంగారం చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో విక్టరీ వెంకటేష్ షూటింగ్ స్పాట్ కి వస్తే కనీసం మర్యాదపూర్వకంగా లేచి నిలబడలేదనీ, కాలు మీద కాలేసుకుని కుర్చీలో అలా కూర్చుండిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి హీరోయన్ కు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చాన్సులు ఇవ్వాలా అని కొందరు వాదిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఇక నయనతారకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కష్టమే అంటున్నారు. మరి కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను భరిస్తూ ఎంతకాలం వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments