Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల మూవీ కథ లీక్... 'చిరు' పాత్ర ఇదేనంటూ ఇంటర్నెట్‌లో హల్‌చల్

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:35 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కె ఈ చిత్రం నేటి సామాజిక అంశాన్ని స్పృశిస్తూ తీస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన క‌థ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో వార్తొక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 
 
వివ‌రాల ప్ర‌కారం దేవాల‌యాల ఆస్తుల‌ను కాజేయ‌డం, భూముల‌ను ఆక్ర‌మించుకోవ‌డం చేస్తార‌ట‌. ఆ అక్ర‌మార్కుల‌ను ప‌ని ప‌ట్టే ఆల‌య అధికారి పాత్ర‌లో చిరంజీవి క‌న‌ప‌డ‌తార‌ని అంటున్నారు. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ను పోషిస్తార‌ని కూడా అంటున్నారు.
 
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తీసిన 'సైరా' సినిమాను చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి కోరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చిరంజీవి దంపతులు ముఖ్యమంత్రిని కలిశారు. హైదరాబాద్‌ నుంచి ట్రూజెట్‌ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవి దంపతులు.. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లారు. 
 
రైతు భరోసాపై సీఎం జగన్‌ సమీక్ష పూర్తయినట్టు వర్తమానం రాగానే.. అక్కడి నుంచి బయల్దేరి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్‌ దంపతులు చిరంజీవి, సురేఖను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. జగన్‌ భార్య భారతికి సురేఖ చీరను బహూకరించారు. తాను హీరోగా నటించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి' గురించి చిరంజీవి జగన్‌కు వివరించారు. ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. దీనిపై జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments