Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనాలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నాకు వద్దనే వద్దు : నాగశౌర్య

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జ్యో అచ్యుతానంద'. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:04 IST)
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జ్యో అచ్యుతానంద'. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ నారా రోహిత్ - నాగశౌర్యలతో కలిసి రెజీనా నటించింది. ఈ క్రమంలో సదరు చిత్రం హీరోలు మీడియాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రెజీనాపై నాగశౌర్య ఆసక్తికర కామెంట్లు చేశాడు. అంతేకాదండోయ్ అతడు చేసిన కామెంట్లకు నారా రోహిత్ కూడా మద్దతు పలికాడు. అయినా రెజీనా గురించి నాగశౌర్య ఏమన్నాడంటే... రెజీనాను భరించడం రీల్ లైఫ్‌లో అయితే ఫర్వాలేదు కానీ - రియల్ లైఫ్‌లో మాత్రం భరించడం చాలా కష్టమని చెప్పాడు. రెజీనా చాలా ఇంటెలిజెంట్ అని ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించినా ఒప్పుకుంటానని పేర్కొన్నాడు. 
 
నాకైతే మాత్రం 'జ్యో అచ్యుతానంద' చిత్రంలోని రెజీనా కారెక్టర్ లాంటి అమ్మాయి మాత్రం తనకు వద్దని అతడు చెప్పాడు. ఇక చిత్రంలో తనకు సోదరుడిగా నటించిన నారా రోహిత్‌కు కూడా రెజీనా వంటి అమ్మాయి వద్దని కూడా అతడు చెప్పాడు. నాగశౌర్య మాటలకు మద్దతు పలికిన నారా రోహిత్ కూడా అతని మాటకు సై అన్నాడు. ఇక తనకు కాలేజీ లైఫ్‌లో జ్యో లాంటి అమ్మాయి తగిలిందా అని చాలా మంది అడుగుతున్నారని అయితే తనకు మాత్రం అలాంటి అమ్మాయి మాత్రం తగలలేదని నాగశౌర్య చెప్పుకొచ్చాడు. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments