Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్‌గా అల్లు అర్జున్... కొత్త పాత్రపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి పని చేయబోతున్నారు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'రన్', 'పందెంకోడి', 'ఆవారా' చిత్రాలు తెలుగు ప్రేక్షుకులను మెప్పించ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:40 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి పని చేయబోతున్నారు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'రన్', 'పందెంకోడి', 'ఆవారా' చిత్రాలు తెలుగు ప్రేక్షుకులను మెప్పించాయి. తాజాగా ఆయన రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బేనర్లో తన తొలి తెలుగు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ను హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. లింగు స్వామి గత సినిమాలు ఇక్కడ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన తాజా సినిమా టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. 
 
ముఖ్యంగా మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారు. లింగుస్వామి గత సినిమాలు చూస్తే.... ఎంటర్టెన్మెంట్ విత్ యాక్షన్, రొమాన్స్ బ్యాక్ బ్రాప్‌తో యూత్‌కు నచ్చేవిధంగా ఆయన సినిమాల శైలి ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించి సరికొత్తగా రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తాడట. ఇటు క్లాస్, అటు మాస్ హీరోయిజం చూపించే స్టైలిష్ స్టార్, ''ఆర్య2'' సినిమాలో కూడా పాత్రలో నెగెటివ్ షేడ్ ఉన్న రోల్‌లో నటించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోందనేది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments