Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌!

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (23:43 IST)
nani, vijay
మ‌రోసారి నాని, విజ‌య్‌దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ రాబోతుంద‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే వారిద్ద‌రూ `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం` సినిమాలో న‌టించారు. ఇద్ద‌రి పాత్ర‌లు వెరైటీవున్నాయి. ఆ సినిమా ఇద్ద‌రికీ మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇప్పుడు మ‌ర‌లా నాని కాంబినేష‌న్‌లో విజ‌య్‌ను తీసుకోవాల‌ని చిత్ర నిర్మాత‌లు చూస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే, టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. నాని క‌థానాయ‌కుడు. బెంగాల్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇప్ప‌టికే బెంగాల్ గెట‌ప్‌లో నాని పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయింది.

అయితే క‌థ ప్ర‌కారం పురాతన కోట ఆ నేప‌థ్యంలో రాజుల గెట‌ప్‌లో ఓ పాత్ర‌కు ఇద్ద‌రు ముగ్గురిని ప‌రిశీలించిన‌ట్లు తెలిసింది. ముందుగా నారారోహిత్‌ను అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్‌లో ఎక్కువ‌మంది ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాను గుర్తుచేస్తూ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మార్కులు వేశార‌ట‌. అయితే ఇందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు అప్రోచ్ అయిన‌ట్లు తెలిసింది. అయితే ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలోగా పూర్తి నిడివి పాత్ర కాదు. గెస్ట్ రోల్‌. ఇలాంటి రోల్‌నే జాతి రత్నాలు సినిమాలో విజ‌య్‌దేవ‌ర‌కొండ చేశాడు. అయితే అది పెద్ద ప్రాధాన్య‌త లేదు. కానీ నాని సినిమాలో సెకండాఫ్‌లో వ‌చ్చే ఆ పాత్ర కీ రోల్ ప్లే చేస్తుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments