Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

డీవీ
గురువారం, 7 నవంబరు 2024 (07:48 IST)
Dulkar, krian
సినిమాలలో ఈక్వెషన్స్ మారడం సహజమే. అంతా రెడీ అనుకున్నది షడెన్ గా నిర్మాతో, హీరోనో, దర్శకుడో మారిపోతుంటాడు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇక వర్తమానంలోకివస్తే నాని రెండు సినిమాలను వదులుకున్నాడని తెలిసింది. క్లాస్, మాస్ హీరోగా పేరుతెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో మాస్ హీరోగా సక్సెస్ తెచ్చుకున్నాడు. అయితే అంతకుమించి మాస్ హీరోగా పేరు సంపాదించాలని చూస్తున్నాడు. 
 
తాజాగా కిరణ్ అబ్బవరపు సినిమా క విడుదలైంది. ఈ సినిమా ఆయన కెరీర్ ను మార్చేసింది. అప్పటివరకు నాలుగైదు సినిమాలు ప్లాప్ లో వుండడంతో ఏదో రకంగా సినిమా సక్సెస్ కోసంవేచి చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే దర్శకసోదరులు సుజిత్.. క కథను కిరణ్ కు చెప్పారు. దాంతో ఆయన వెనుకడుగువేయకుండా ఓకే చేశారు. దానితో నిర్మాత కూడా ముందుకురావడంతో క సినిమా బాధ్యత అంతా కిరణ్ చూసుకున్నాడు. ఈ కథను అంతకుముందు ఇద్దరు హీరోలకు చెప్పారట దర్శకులు. అందులో నాని కూడా వున్నాడు. కానీ ఈ సినిమా నేను ఇప్పుడు చేయలేనని చెప్పడంతో వెంటనే కిరణ్ ను వరించింది. ఈ సినిమా కథలో క్లయిమాక్స్ పై పూర్తి నమ్మకంతో వున్న కిరణ్ అబ్బవరం తాను అనుకున్నట్లే ప్రేక్షకులు కూడా తీర్పు చెప్పడంతో సక్సెస్ బాట పట్టాడు. 
 
అదేవిధంగా దర్శకుడు వెంకీ అట్లూరి ఓ కథను తీసుకుని ఇద్దరు హీరోలకు చెప్పాడు. కానీ ఎవ్వరూ అందుకు సంసిద్ధతను వ్యక్తం చేయలేదుట. నానికి కూడా కథ చెప్పడంతో ఇది షేర్ మార్కెట్, బ్యాంక్ నేపథ్యం కనుక కాస్త ఆలోచించాలను చెప్పడం, టైం తీసుకోవడంతో వెంకట్ సితార ఎంటర్ టైన్ మెంట్ బేనర్ కు చెప్పడంతో నిర్మాత నాగవంశీ ఆలోచించి మలయాళ నటుడు అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యాడు. ఆయనే దుల్కర్ సల్మాన్. కేరళ వెళ్ళి దర్శకుడు కథ చెప్పగానే మరోమాట ఆలోచించకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ సినిమానే లక్కీ భాస్కర్. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ తో రన్ లో వుంది. సో. ఇండస్ట్రీలో ఒకరు కాదన్న కథ మరోరి దక్కడం కూడా లక్కే కదా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డోనల్డ్ ట్రంప్: భారత్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉండనున్నాయి?

ఆర్టీసి బస్సు నడుపుతూనే గుండెపోటుతో ప్రాణాలు వదిలిన డ్రైవర్, ఏమైంది? (Video)

వర్రా రవీందర్ రెడ్డిని వదిలేసిన పోలీసులు.. కడప జిల్లా ఎస్పీపై బదిలీవేటు?

జెడి వాన్స్: తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతున్నాడు (video)

డోనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి ఎంతో తెలుసా.. ఒక్క నెలలో రెట్టింపు ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments