Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు చిత్రంలో గెస్ట్ రోల్‌లో నమ్రతా శిరోద్కర్!

''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (10:43 IST)
''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు జోడిగా నదియా నటిస్తుంది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు నటించలేదు. ఇప్పుడు మళ్లీ నమ్రత సినిమాల్లో నటిస్తుందనే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం వేచియుండాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు.. హాజరవుతారో? లేదో?

జనవరి 8న నరేంద్ర మోదీ పర్యటన- సర్వం సిద్ధం చేస్తోన్న ఏపీ సర్కారు

హోం మంత్రి అనిత పీఏ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు.. పదవి నుంచి అవుట్

Thalliki Vandanam: జూన్ 15 నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభం

HMPV కొత్త వైరస్.. ఆస్పత్రులు నిండిపోలేదు.. చలికాలం అవి సహజమే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments