Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' రేటింగ్‌ను చూసి బంబేలెత్తిపోతున్న జాకీచాన్

దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన సెల్యులాయిడ్‌ వండర్‌ ''బాహుబలి ది బిగినింగ్‌'' ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డులు సృష్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (10:39 IST)
దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన సెల్యులాయిడ్‌ వండర్‌ ''బాహుబలి ది బిగినింగ్‌'' ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రం 'బాహుబలి'. అన్ని భాషలల్లోను విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన చిత్రాల్లో 'బాహుబ‌లి' ఓవర్ ఆల్‌గా ఆరవ స్థానాన్నిదక్కించుకుంది. 
 
''బాహుబలి'' చైనా భాషలో ఇటీవలే విడుదలై సందడి చేస్తుంది. చైనాలో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల కలక్షన్స్ వసూలు చేసి ముందుకు దూసుకుపోతుంది. అంతేకాదు చైనా బాక్సాఫీస్ వద్ద టాప్ టెన్‌లో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది. చైనా మీడియా మొదట్లో ఈ సినిమాకు 7.1 రేటింగ్ ఇస్తే ఇప్పుడు ఆ రేటింగ్ 7.7 కు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
 
అయితే ఈ సినిమా రేంజ్‌ని చూసి ఓ హీరో గజగజ వణికిపోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు జాకీచాన్‌. ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్‌ చూసి తెగ టెన్షన్‌ పడుతున్నాడట. అందుకు కారణం జాకీచాన్‌ సినిమా కన్నా ''బాహుబలి''కి ఎక్కువ క్రేజ్‌ రావడమే ఈ టెన్షన్‌కు కారణం. అందరిని తన నటనతో వణుకు పుట్టించే జాకీ ఈ సినిమాను చూసి భయపడుతుంటే ఈ సినిమా కున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments