Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్ హీరోను హగ్ చేసుకోవాలని ఉంది : నాగార్జున

నాగ చైతన్య కెరీర్‌లో ప్రేమమ్ నిలిచిపోతుంది. ఈ మూవీ చాలా చాలా బాగుంది'. ఇవి ఎవరో చెప్పినవి కావు. 'నాగార్జున' ఇలాంటి ట్వీట్స్‌తో 'ప్రేమమ్' చిత్రంపై అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. 2015‌లో వచ్చిన ''దోచెయ్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:49 IST)
నాగ చైతన్య కెరీర్‌లో ప్రేమమ్ నిలిచిపోతుంది. ఈ మూవీ చాలా చాలా బాగుంది'. ఇవి ఎవరో చెప్పినవి కావు. 'నాగార్జున' ఇలాంటి ట్వీట్స్‌తో 'ప్రేమమ్' చిత్రంపై అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. 2015‌లో వచ్చిన ''దోచెయ్'' పరాజయం తర్వాత హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం ''ప్రేమమ్''. 
 
ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలన్న ఉద్దేశ్యంతో చైతు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. చైతూ అనుకున్నట్టే శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే విమర్శకుల, ప్రేక్షకుల ప్రసంశలు అందుకుని మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. దీంతో నాగ చైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఈ సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో మున్ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఇక చైతూకు కాబోయే భార్య సమంత అయితే మొదటి షో టాక్ రావడంతోనే పట్టరాని సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. మలయాళ ''ప్రేమమ్''కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో అనుపమ, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇదివుంటే అక్కినేని నాగార్జున నాగ చైతన్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 
 
ఇంతకీ ఏమన్నాడంటే.. 'ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా... చైతూని హగ్ చేసుకుంటానా అని చాలా అత్రంగా ఉంది' అని నాగచైతన్య గురించి అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ప్రేమమ్' చిత్రానికి మంచి స్పందన వస్తుండటంతో కువైట్‌లో ఉన్న నాగార్జున ఉబ్బితబ్బిబయ్యారు. వెంటనే ఇంటికి వెళ్లి 'చై'ని హగ్ చేసుకోవాలనుందంటూ ఆయన ఓ ట్వీట్‌లో అభిమానులతో సంతోషం పంచుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments