ఆ ముగ్గురితో నాగార్జున వందో సినిమా.. బంగార్రాజుగా కనిపించనున్న మన్మథుడు

టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా.. మెగాస్టార్ 150వ సినిమా ఫీవర్‌కు తెరపడింది. ప్రస్తుతం నాగార్జున వందో సినిమా గురించి టాక్ మొదలైంది. కానీ ఈ సినిమా ఇప్పటికిప్పుడు తెరకెక్కే ఛాన్స్ లేదంటున్నారు సినీ పండి

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:07 IST)
టాలీవుడ్‌లో బాలయ్య వందో సినిమా.. మెగాస్టార్ 150వ సినిమా ఫీవర్‌కు తెరపడింది. ప్రస్తుతం నాగార్జున వందో సినిమా గురించి టాక్ మొదలైంది. కానీ ఈ సినిమా ఇప్పటికిప్పుడు తెరకెక్కే  ఛాన్స్ లేదంటున్నారు సినీ పండితులు. కుమారుల పెండ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున వాస్తవానికి వంద సినిమాలకు చేరువ కాలేదు. కానీ కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే వందకు దగ్గరవుతాయి. 
 
నాగార్జునకు ఈ విషయంలో అంత ఆసక్తి లేకున్నా, అభిమానులు మాత్రం వందో సినిమా ఓ మైల్ స్టోన్ కావాలని నాగ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఫ్యాన్స్ కోరిక మేరకు వందో సినిమా చేయాలని నాగ్ డిసైడైపోయాడట. సినిమా కథ అయితే రెడీగా లేదు కానీ, క్యారెక్టర్ మాత్రం బంగార్రాజు అని నాగ్ ఫిక్సయిపోయాడట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అనేది అందరికీ తెలిసిందే. 
 
అందుకే బంగార్రాజు క్యారెక్టర్‌ను సెంట్రల్ పాయింట్‌గా తీసుకుని, మాంచి కథ రెడీ చేయమని ఒకరిద్దరు డైరక్టర్లకు సూచించాడట. అంతేగాకుండా ఆ సినిమాలో అఖిల్, చైతూ కూడా నటించేందుకు వీలుగా మంచి క్యారెక్టర్లను సృష్టించమని నాగ్ దర్శకుడికి తెలిపాడట. అమల కూడా ఈ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ లోగా రాజుగారి గది 2, చందుమొండేటి సినిమాలు పూర్తి చేసుకోవాలని నాగార్జున డిసైడైపోయాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments