Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో భక్తిరస చిత్రంలో నాగార్జున? 'రాజుగారి గది' సీక్వెల్ తర్వాత షూటింగ్ స్టార్ట్!

తెలుగు చిత్ర పరిశ్రమలో భక్తిరస చిత్రాల వారసుడిగా కొనసాగుతున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో భక్తిరస చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (06:26 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో భక్తిరస చిత్రాల వారసుడిగా కొనసాగుతున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో భక్తిరస చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున నటించిన "ఓం నమో వేంకటేశాయ" చిత్రం వచ్చే నెల పదో తేదీన విడదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత ఈ భక్తిరస చిత్రంలో నటించేందుకు ఆయన సమ్మతించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
'ఇస్కాన్' స్థాపకుడు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుదేవ జీవితగాథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కథను నాగార్జునకు రచయిత భారవి వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయట. దీంతో స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో భారవి నిమగ్నమైవున్నారు. 
 
కాగా, "ఓం నమో వెంకటేశాయ" తర్వాత ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున 'రాజుగారి గది' సీక్వెల్‌లో నటించనున్నారు. ఆ తర్వాత మళ్లీ భక్తిరస చిత్రంలో నటించే అవకాశం ఉంది. కాగా, నాగార్జున ఇప్పటికే అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయిబాబా వంటి భక్తిరస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆలరించిన విషయం తెల్సిందే. ఈ మూడు చిత్రాలతో పాటు.. ఓం నమో వేంకటేశాయ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. అయితే, మరో కొత్త చిత్రానికి దర్శకుడు ఎవరన్నది వెల్లడి కావాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments