Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ" కుమ్ముడు... 'బాహుబలి' రికార్డ్స్ బద్ధలు.... యుఎస్‌లో జస్ట్ మిస్...

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" కుమ్ముడుకు 'బాహుబలి' రికార్డు బద్ధలైపోయింది. కానీ యూఎస్‌లో మాత్రం ఖైదీ దెబ్బను బాహుబలి తట్టుకుని నిలబడింది. ఇక్కడ మాత్రం రికార్డు బద్ధలు తృటిలో తప్పిపో

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (06:15 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" కుమ్ముడుకు 'బాహుబలి' రికార్డు బద్ధలైపోయింది. కానీ యూఎస్‌లో మాత్రం ఖైదీ దెబ్బను బాహుబలి తట్టుకుని నిలబడింది. ఇక్కడ మాత్రం రికార్డు బద్ధలు తృటిలో తప్పిపోయింది. మొత్తంమీద ఖైదీ చిత్ర కలెక్షన్లు తొలిరోజున ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.
 
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తొలిరోజు చిత్ర కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. తెలుగు సినిమాల్లో తొలిరోజు అత్యధికంగా గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా 'ఖైదీ నంబర్‌ 150' నిలిచిందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.47.07 కోట్లు వసూలు చేసిందన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో రూ.30.04 కోట్లు, కర్ణాటకలో రూ.4.72 కోట్లు, ఒరిస్సాలో రూ.12 లక్షలు,  తమిళనాడులో రూ.20 లక్షలు, ఓవర్సీస్ ‌(అమెరికా) 1.22 మిలియన్‌ డాలర్లు (రూ.8.9 కోట్లు), మిగిలిన దేశాల్లో సుమారు రూ.2.12 కోట్లు వసూలు చేసిందని వివరించారు. ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి నిర్మాత రామ్‌చరణ్‌ ఒకరోజు ముందే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారన్నారు. గతంలోలా కాకుండా రెండు, మూడు వారాల్లో కలెక్షన్లు పూర్తవుతున్నాయన్నారు. తనకు తెలిసి సుమారు 2 వేల తెరలపై చిత్రాన్ని ప్రదర్శించారని తెలిపారు. కాగా, ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ రూ.103 కోట్లుగా జరిగిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments