Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్రర్ సినిమాలో కింగ్ నాగార్జున...ఓంకార్ దర్శకత్వంలో...

ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరబ్‌ జైన్‌, జగపతిబాబు,

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (11:29 IST)
అక్కినేని నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ''అన్నమయ్య'', ''శ్రీరామదాసు'', ''శిరిడి సాయి'' చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న భక్తిరస చిత్రం ''ఓం నమో వేంకటేశాయ''. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరబ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత.. నాగ్ చేయనున్న సినిమా ఏంటనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. 
 
తన కొడుకుల కెరీర్‌లను గాడిలో పెట్టడమే తన తక్షణ కర్తవ్యం అని నాగ్ ఓపెన్ గానే చెప్పేశారు. పైగా ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఎంగేజ్మెంట్.. పెళ్లిళ్లు కూడా దగ్గరపడిపోతుండడంతో.. ఆ పనులలో ఈ హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే కొద్ది రోజుల పాటు మూవీస్‌కి దూరంగా ఉండాలని భావించారట కానీ.. ఓ దెయ్యం సినిమా సీక్వెల్ కారణంగా ఆయన పట్టు విడవాల్సి వచ్చిందట. ''రాజు గారి గది'' అంటూ సెన్సేషనల్ హిట్ సాధించిన దర్శకుడు ఓంకార్.. ఈ మూవీకి సీక్వెల్‌కి స్క్రిప్ట్ రెడీ చేసుకుని.. నాగార్జునను కలిశాడట. 
 
ఇప్పటికే పీవీపీ నిర్మాణ సంస్థకూడా రాజుగారిగది సీక్వెల్‌ను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటివరకూ చిరు-నాగ్-బాలయ్య-వెంకీ లాంటి పెద్ద తెలుగు స్టార్ హీరోలెవరూ హారర్ జోనర్‌లో సినిమాలు చేయలేదు. కానీ నాగ్ మాత్రం ఈ ట్రెండ్‌కి బ్రేక్ వేసి.. హారర్ సినిమా మొదలుపెట్టేస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments