Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతుకి రాత్రుళ్లు నిద్ర ఉండ‌డం లేద‌ట‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

అక్కినేని నాగచైతన్య రాత్రి పూట నిద్రపోయి రెండు రోజులు అవుతోంది. చైత‌న్య‌దే కాదండోయ్... హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. ఇంత‌కీ... ఏమైందని అనుకుంటున్నారా? విష‌యం ఏంటంటే... రాత్రిపూట సినిమా షూటింగుతో సరిపోతుంది. ఇక నిద్రపో

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:55 IST)
అక్కినేని నాగచైతన్య రాత్రి పూట నిద్రపోయి రెండు రోజులు అవుతోంది. చైత‌న్య‌దే కాదండోయ్... హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. ఇంత‌కీ... ఏమైందని అనుకుంటున్నారా? విష‌యం ఏంటంటే... రాత్రిపూట సినిమా షూటింగుతో సరిపోతుంది. ఇక నిద్రపోయే టైమ్ ఎక్కడిది? అందుకని పగలు కంటినిండా కునుకు తీస్తున్నారు. 
 
నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న‌ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జ‌య‌భేరి క్ల‌బ్‌లో జరుగుతోంది. రెండు రోజుల నుంచి చైతూ, అనూ, మురళీశర్మ తదితరులపై రాత్రిపూట వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 
 
మరో వారంరోజుల పాటు నైట్ షెడ్యూల్ వుంటుందట. ఓపక్క ‘శైలజారెడ్డి అల్లుడు’ నైట్ షూటింగ్ చేస్తున్న నాగచైతన్య, మరోపక్క ‘సవ్యసాచి’ మార్నింగ్ షూట్ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ కోసం తమన్నాతో కలసి ఐటమ్ సాంగ్ కోసం స్టెప్పులు వేస్తున్నాడు. జులైలో స‌వ్య‌సాచి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments