Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు హీరోయిన్ వా?... ఈ అర్థరాత్రి తిరుగుళ్లేంటి... రోడ్డున పడిన వర్ధమాన నటి

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఒకరు రోడ్డున పడ్డారు. ఆమె నివశిస్తున్న కాలనీ సొసైటీ సభ్యుల ప్రవర్తన కారణంగా ఆమె రోడ్డు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు హీరోయిన్‌వా? అయితే, ఈ అర్థరాత్రి

Webdunia
మంగళవారం, 16 మే 2017 (14:03 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఒకరు రోడ్డున పడ్డారు. ఆమె నివశిస్తున్న కాలనీ సొసైటీ సభ్యుల ప్రవర్తన కారణంగా ఆమె రోడ్డు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు హీరోయిన్‌వా? అయితే, ఈ అర్థరాత్రి తిరుగుళ్లేంటి? అంటూ సొసైటీ సభ్యులు పలువురు పలు రకాలుగా మాట్లాడటమే కాకుండా, ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ నటి వాపోతోంది. ఇంతకీ ఆ నటి పేరు ఏంటో తెలుసా.. నిధి అగర్వాల్. 
 
యాక్షన్‌స్టార్ టైగర్ ష్రాఫ్‌తో 'మున్నా మైఖేల్' అనే చిత్రంలో నటించిన నిధి... బెంగళూరు నుంచి ముంబైకి వచ్చింది. గత ఏడాదిగా బాంద్రాలో ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో స్నేహితురాలితో కలిసి ఉంటోంది. అయితే ఈ హౌసింగ్ సొసైటీ ఇటీవల ఆమెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. దానికి కారణాన్ని కూడా సొసైటీ సభ్యులు వివరించారు. సినిమా షూటింగ్స్ కారణంగా ఇంటికి వేళాపాళా లేకుండా ఇంటికి వచ్చేది. దీంతో కాలనీ సొసైటీ సభ్యులు వింతగా చూడటం మొదలుపెట్టారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ 'ఆరు నెలలుగా స్నేహితురాలితో కలిసి ఉంటున్నాను. అయితే సింగిల్‌గా ఉన్న నటి, మోడల్స్‌పై వీరికి చాలా చిన్న చూపు. నేను సింగిల్‌గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది. సినిమా షూటింగ్స్ కారణంగా తాము ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి నచ్చడం లేదని చెప్పుకొచ్చింది. 
 
దీంతో తమపై వారికి లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయని, వీటిని హౌసింగ్ సొసైటీలో కొందరు సమర్థించడంతో... నువ్వు హీరోయిన్ వా?... అయితే అర్థరాత్రి ఈ రావడాలేంటి? అంటూ అనుమానంగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాదు... ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఇల్లు వెతికితే... నువ్వు సింగిల్, సినిమాల్లో నటిస్తున్నావా? అంటూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు తయారైంది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments