Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' నా ఒక్కడికే నచ్చలేదు... జనాలకు నచ్చింది.. సారీ జక్కన్నా : కమల్ ఆర్ ఖాన్

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. నిజంగా 'బాహుబలి 2' తనకు నచ్చలేదని, జనాలకు నచ్చిందని చెప్పుకొచ్చారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత చూసిన కేఆర్‌

Webdunia
మంగళవారం, 16 మే 2017 (13:55 IST)
దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. నిజంగా 'బాహుబలి 2' తనకు నచ్చలేదని, జనాలకు నచ్చిందని చెప్పుకొచ్చారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత చూసిన కేఆర్‌కే ఈ చిత్రంపై రివ్యూ రాశారు. ఈ చిత్ర కథ పరమ చెత్త అంటూ అందులో పేర్కొన్నారు. అయితే, సినీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి తాను తప్పుడు రివ్యూను ఇచ్చినందుకు సారీ అని అన్నాడు. తనకు నిజంగా సినిమా నచ్చలేదని, కానీ జనాలకు నచ్చిందని, జనం మాట దేవుడి వాక్కుతో సమానమని అన్నాడు. అందువల్ల రాజమౌళికి క్షమాపణలు చెబుతున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు.
 
కాగా, ఈ సినిమా విడుదలైన కొత్తల్లో, దీన్ని చెత్త సినిమా అని, ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని, రానా ఇడియట్ అని తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యాఖ్యానించి విమర్శలు మూటగట్టుకున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments