Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహరీన్ అలా చేసి ఛాన్సులు కొట్టేస్తోందట...?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (19:36 IST)
తెలుగు సినీపరిశ్రమలో అనతికాలంలోనే టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలో చేరింది మెహరీన్. మొదట్లో వరుసగా విజయాలు వరించినా ఆ తరవాత వరుస పరాజయాలు తప్పలేదు. దానికి తోడు మెహరీన్ బొద్దుగా తయారైంది అంటూ తెలుగు సినీపరిశ్రమలో టాక్. ఇక ఛాన్సులు రావడం తగ్గిపోయింది. దీంతో మెహరీన్ ఆలోచనలో పడింది.
 
సినిమా అవకాశాలు రావాలంటే స్లిమ్‌గా అవ్వాలి అని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా బాగా స్లిమ్ అయ్యింది. ఇంకేముంది ఆ తరువాత ఎఫ్‌-2లో నటించింది. ఆ సినిమా కాస్త భారీ విజయాన్ని సాధించింది. మెహరీన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇంకేముంది మళ్ళీ మెహరీన్ ఫాంలోకి వచ్చేసిందనుకున్నారు అందరూ.
 
అనుకున్నట్లే వరుసగా సినిమాలు రావడం ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మెహరీన్‌కు అవకాశాలు వరుసపెట్టాయి. తెలుగులో చాణక్య సినిమాలో గోపీచంద్‌తో నటిస్తుండగా, కళ్యాణ్‌ రామ్‌తో మరో సినిమా ఒకే చేసేసింది. ఆ తరువాత తమిళంలో ఒక సినిమా, హిందీలో మరో సినిమాకు సంతకం చేసేసింది. ఇలా వరుసగా ఛాన్సులు రావడంతో మెహరీన్ సమయం లేకుండా గడుపుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పళనిలో పవన్ కల్యాణ్.. తిరుపతి-పళనికి బస్సు సర్వీసులు పునఃప్రారంభం (video)

Chittoor To Prayagraj- మహా కుంభమేళాకు సీఎన్‌జీ ఆటోలోనే వెళ్లిన ఏపీ యువకులు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments