Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" విడుదలకు అడ్డుపడుతున్న కరోనా!

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:10 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్‌ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి ఇపుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 
 
ఆ చిత్రం కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు మొన్న విడుదలైన 'లాహే లాహే' పాట యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. 
 
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు. ఈ పాటతో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.100 కోట్లకు పైగా జరుగుతుంది. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో 'ఆచార్య' ముందు వరుసలో ఉంటుంది. 
 
మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో 'ఆచార్య' సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' కూడా వాయిదాపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments