Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు నిర్మాత సుధీర్‌ బాబు హీరో కీలక పాత్రలో గౌతమ్‌!

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (15:11 IST)
Mahesh Babu, Sudhir Babu, Gautham
సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, సుధీర్‌బాబు బావబావమరిదిలు అన్న విషయంతెలిసిందే. సినిమాల్లో హీరోగా రావాలనుకున్నప్పుడు ఇండస్ట్రీలో లోటుపాట్లను గురించి విపులంగా తెలిపాడు మహేష్‌. ఇక ఇప్పుడు భిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు నటుడిగా కాకముందు టెన్నిస్‌ప్లేయర్‌. తాజాగా అటువంటి కథతో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరలేదు. 
 
కానీ సూపర్‌స్టార్‌ కృష్ణ బయోపిక్‌ గనుక చేస్తే తాను కృష్ణగారి పాత్ర చేస్తానని చెబుతున్న సుధీర్‌బాబు ఆ సినిమాను మహేష్‌ బాబు నిర్మాత వుంటాడని అంటున్నారు. ఎప్పటినుంచో కృష్ణగారి బయోపిక్‌ చేయాలని ఆయన అభిమానులు మహేష్‌బాబుకు, నమత్రకు విన్నవించుకున్నారు. ఇందుకు ఆదిశేషగిరిరావు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కృష్ణగారి సినిమా తీస్తే అందులో సుధీర్‌బాబు ఫిక్స్‌ అయపోయాడు. మరి కృష్ణగారి కొడుకుగా మహేష్‌బాబు పాత్రను గౌతమ్‌ చేస్తాడని టాక్‌ నెలకొంది. ఇందుకు మహేష్‌ బాబు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. వయస్సురీత్యా గౌతమ్‌ కరెక్ట్‌ సరిపోతాడని అంటున్నారు. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments