Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి హీరోల‌ను మ‌రింత టెన్ష‌న్ పెడుతున్న వెంకీ మామ‌

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (18:04 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం వెంకీ మామ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అయితే.. ఈ సినిమాని ద‌స‌రాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుద‌ర‌లేదు. ఇప్ప‌డు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తుండ‌డంతో సంక్రాంతి రానున్న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల‌.. వైకుంఠ‌పుర‌ములో టీమ్స్ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాయి.
 
దీంతో మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో.. చిత్రాలు ఒకేరోజు జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎప్పుడైతే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసారో.. అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను సంక్రాంతి బాక్సాఫీస్ వార్‌లో మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే.. వెంకీమామ జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంద‌ట. 
 
అంటే...మ‌హేష్‌, బ‌న్నీ ఈ రెండు సినిమాల కంటే ఒక రోజు ముందుగానే ఈ చిత్రం విడుదలవుతుంది. ఒక రోజు ముందు రిలీజ్ చేయ‌డం వ‌ల‌న వెంకీ మామ‌కు ఫ‌స్ట్ డే ఎక్కువ థియేట‌ర్స్ దొరుకుతాయి. అలా చేయ‌డం వ‌ల‌న త‌ర్వాత వ‌చ్చే మ‌హేష్‌, బ‌న్నీ సినిమాల‌కు ఇబ్బంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి.. వెంకీ మామ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments