Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో మీ లావణ్య త్రిపాఠి... బడా నిర్మాత తనయుడితో...

నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో పడిందట. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో. ఇప్పటికే ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:09 IST)
నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో పడిందట. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో. ఇప్పటికే ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2012 సంవత్సరంలో సినిమాల్లోకి వచ్చిన లావణ్య త్రిపాఠి చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ మోడల్ తెలుగును నేర్చేసుకుంది. అందరితో ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతోందట. 
 
అయితే లావణ్య గత కొన్నినెలలుగా అల్లు శిరీష్‌‌తో ప్రేమలో పడినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక ఫంక్షన్‌కు వెళ్ళినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. దీంతో ఇద్దరూ మెసేజ్‌లు, చాటింగ్, అప్పుడప్పుడు రెస్టారెంట్లలో కలవడంలాంటివి చేస్తున్నారట. సినీపరిశ్రమలో ఎవరెప్పుడు సన్నిహితంగా ఉంటారో చెప్పలేని పరిస్థితి. అయితే అల్లు శిరీష్‌‌కు పెద్దగా సినిమాలు లేవు. లావణ్య త్రిపాఠి చేతిలో మాత్రం ప్రస్తుతం తమిళంలో మూడు, తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటోంది.
 
అల్లు శిరీష్‌‌కు సినిమాలు లేకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట లావణ్య. కొంత మంది స్నేహితులు శిరీష్‌ ఇంకా సినీపరిశ్రమలో నిలదొక్కుకోలేదని చెబుతున్నా పట్టించుకోవడం లేదట. అంతగా ప్రేమలో మునిగిపోయింది లావణ్య. వీరి ప్రేమ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని అల్లు అరవింద్. సినిమా ఫీల్డ్ లో ఇవన్నీ మామూలేనన్న భావనలో ఆయన ఉన్నారట. అయితే వీరిద్దరు నిజంగా ప్రేమించుకుంటే వీరి ప్రేమ పెళ్ళి వరకు పోతుందో లేకుంటే సగంలో ఆగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments