Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త భరణం డబ్బుతో జల్సా చేస్తున్నానా? నెటిజన్లకు ఘాటైన మలైకా అరోరా రిప్లై

కోటీశ్వరుడైన భర్తను వదిలివేసి భరణంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తోందంటూ నెటిజన్లు చేసిన కామెంట్లపై బాలీవుడ్ నటి మలైకా అరోరా ఒకింత ఘాటుగానే స్పందించింది. భర్తతో విడిపోయాక తొలిసారి మలైకా మీడియాతో తన జీవ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (15:46 IST)
కోటీశ్వరుడైన భర్తను వదిలివేసి భరణంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తోందంటూ నెటిజన్లు చేసిన కామెంట్లపై బాలీవుడ్ నటి మలైకా అరోరా ఒకింత ఘాటుగానే స్పందించింది. భర్తతో విడిపోయాక తొలిసారి మలైకా మీడియాతో తన జీవితం గురించి చెప్పుకొచ్చింది. ‘అర్బాజ్‌ నా కుటుంబంలో ఒకరు. నా కుమారుడు అర్హాన్‌కి తండ్రి. కొన్ని బంధాలు రాత్రికి రాత్రే మారిపోవు. నాకు అర్బాజ్‌కి మధ్య జరిగినవన్నీ అలాగే ఉండిపోవాలని ఆశిస్తున్నా. ఇది నా వ్యక్తిగత విషయం. మా విషయమై ఇతరులకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. అర్బాజ్‌ని కలిస్తే నా కుమారుడు సంతోషంగా ఉంటాడు. వాడి సంతోషమే నాకు ముఖ్యం.’ అని చెప్పుకొచ్చింది. 
 
అలాగే, ‘అర్బాజ్‌ నా సోదరి అమృతకు ఓ అన్నలా, నా తల్లిదండ్రులను తన కన్నవారిలా చూసుకుంటాడు. నాకు మాత్రమే అర్బాజ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఇద్దరం విడిపోయినా ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైన మనిషి. విడిపోవడం ఎవ్వరికీ ఇష్టముండదు. అది అంత సులువు కాదు కూడా. అనుభవించేవారికే ఆ బాధ తెలుస్తుంది. నాకు ఇప్పుడు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నా స్నేహితులతో పంచుకుంటున్నాను. అయితే నా జీవితంలో మరో వ్యక్తికి స్థానం ఉందా అని అందరూ అడుగుతున్నారు. దీని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నేను ప్రస్తుతం ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడుపుతున్నాను. నా కుమారుడితో సంతోషంగా ఉన్నాను. ఇటీవల విహారయాత్ర ముగించుకుని వచ్చాం’ అని వివరించింది. పైగా, తన భర్తతో ఉన్నపుడు గడిపిన ప్రతి క్షణాన్ని మరచిపోలేని తీపిగుర్తులని వ్యాఖ్యానించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments