Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ కోరిక తీరింది... ఇపుడు ఖుషీ కపూర్ వంతు వచ్చింది...?

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (15:24 IST)
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూశారు. ఆ కోరిక 'దేవర'తో తీరింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పుడు ఖుషి కపూర్ వంతు వచ్చింది. ఖుషికి కూడా నటనపై ఆసక్తి ఉంది. ఒకటి రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది కూడా. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. కాకపోతే. శ్రీదేవి కుమార్తె అనే క్రేజ్ ఉంది కదా! అందుకే ఆమెకూ మంచి అవకాశాలే వస్తున్నాయి. 
 
తాజాగా తమిళ చిత్రసీమ నుంచి ఖుషికి కబురొచ్చింది. అధర్వ కథానాయకుడిగా ఆకాశ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఖుషిని తీసుకొన్నారని టాక్. తెలుగు నుంచి కూడా ఖుషికి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. 
 
అయితే.. 'బడా హీరో సినిమా, లేదంటే క్రేజీ ప్రాజెక్ట్ అయితేనే చేస్తాను' తేల్చి చెప్పిందట. ఖుషికి ఇప్పటికిప్పుడు స్టార్ హీరోలు అవకాశం దక్కడం కష్టమేగానీ, చిన్న సినిమా చేసి, నిరూపించుకొంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావొచ్చని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. అప్పటివరకు ఖుషీ కపూర్ వేచిచూడాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments