Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ సరసన కృతిశెట్టి...

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:11 IST)
ఇటీవలే రెడ్ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న రామ్ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తరువాత రామ్ ప్రస్తుతం తమిళ దర్సకుడు లింగుస్వామి దర్సకత్వంలో ఓ మూవీకి ఒకే చెప్పారట. 
 
యాష్, ఆర్.ఎ.పి.ఓ.19 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి నదియా అత్త పాత్రలో నటిస్తున్నారట.
 
పోలీస్ పాత్రలో తనలోని మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్న రామ్ ఈ సినిమా సక్సెస్ పైన ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారట. అయితే రామ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా మరో హీరోయిన్ కూడా వచ్చి చేరిందట. 
 
ఈ మూవీలో కృతిశెట్టితో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోందట. చిత్ర యూనిట్ ఆ హీరోయిన్ ఎవరో కూడా చెప్పేశారట. ఈ మూవీలో కన్నడ బ్యూటీ అక్షర నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ బ్యానర్ చిత్రీకరిస్తుండగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments