Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్యా... అది చేస్తే పోయేది కదా... లేనిపోని తంటా....

అందాల రాక్షసి అంటూ తెరపైకి వచ్చిన అందగత్తె లావణ్య త్రిపాఠి. ఆమధ్య వరుస ఆఫర్లతో కవ్వించిన ఈ సుందరాంగి ఈమధ్య చేతిలో సినిమాలు లేక గోళ్లు గిల్లుకుంటుందని టాలీవుడ్ జనం గుసగుసలాడుకుంటున్నారు. మొన్ననే విడుదలైన ఉన్నది ఒకటే జిందకీ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రా

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (18:54 IST)
అందాల రాక్షసి అంటూ తెరపైకి వచ్చిన అందగత్తె లావణ్య త్రిపాఠి. ఆమధ్య వరుస ఆఫర్లతో కవ్వించిన ఈ సుందరాంగి ఈమధ్య చేతిలో సినిమాలు లేక గోళ్లు గిల్లుకుంటుందని టాలీవుడ్ జనం గుసగుసలాడుకుంటున్నారు. మొన్ననే విడుదలైన ఉన్నది ఒకటే జిందకీ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రాలు పెద్దగా ఏమీ లేవని సమాచారం. ఇదిలావుంటే గతంలో తమన్నా, నాగచైతన్య జంటగా నటించిన 100 పర్సెంట్ లవ్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తుండగా అందులో లావణ్య నటించేందుకు అంగీకరించిందట. 
 
ఈ చిత్రంలో హీరో సంగీత దర్శకడు జీవీ ప్రకాష్. మరి సంగీత దర్శకుడు సరసన నటించేదేమిటి అనుకున్నదో ఏమోగానీ ఆ చిత్రంలో నటించడంలేదని స్పష్టం చేసి బయటకు వచ్చేసింది. దీనితో చిత్ర బృందం షాక్ తిన్నారు. ఆమె నిర్ణయంపై తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమకు లావణ్య తప్పుకోవడం వల్ల రూ. 3 కోట్లు నష్టం వచ్చిందనీ, ఆ డబ్బును ఆమె నుంచి వసూలు చేసి ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారట. 
 
దీనిపై నిర్మాతల మండలి స్పందిస్తూ... ఆమెపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు... చిత్ర నిర్మాతలు నష్టపోయిన రూ. 3 కోట్లు కూడా తిరిగి చెల్లించాలంటూ ఆమెకు లేఖ పంపారని అంటున్నారు. అసలే చేతిలో సినిమాలు లేని లావణ్య త్రిపాఠి 3 కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుంది... లావణ్యా.. ఆ సినిమా ఏదో చేసేస్తే పోయేది కదా అంటున్నారట టాలీవుడ్ ఇండస్ట్రీ జనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

నోరూరించే హైదరాబాద్ బిర్యానీ.. నాణ్యత జారిపోతోంది..

సరోగసీ కోసం హైదరాబాదుకు.. లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్య

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments