Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా ఉంటే 3 గంటలు పాటు.. బిజీగా ఉంటే అర్థ గంట అది చేస్తా : కోడి రామకృష్ణ

''అమ్మోరు'', ''అరుంధతి'' చిత్రాల సృష్టికర్త తెలుగు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌ దేవతా చిత్రం ''శివనాగం''. కన్నడంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (09:21 IST)
''అమ్మోరు'', ''అరుంధతి'' చిత్రాల సృష్టికర్త తెలుగు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌ దేవతా చిత్రం ''శివనాగం''. కన్నడంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే 14వ తేదీన ''శివనాగం''ను ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఫ్రీగా ఉంటే 3 గంటలు.. బిజీగా ఉంటే అరగంట పాటు పూజ చేస్తానని అన్నారు. "ఒక రోజు కాలువలో పడి నేను కొట్టుకుపోతుంటే.. మధ్యలో ఒక వ్యక్తి నన్ను బతికించాడు. ఈ విషయాన్ని అమ్మకు చెబితే.. బాధ, కోపం, ప్రేమతో నన్ను బాగా కొట్టింది. దేవుడికి దండం పెట్టకుండా, పూజ చేయకుండా బయటకు వెళ్లొద్దు అని ఆరోజు చెప్పిన మాటలు ఈరోజు వరకు నేను పాటిస్తూనే ఉన్నాను. 
 
అందుకోసం.. ఫ్రీగా ఉంటే 3 గంటలు పాటు.. బిజీగా ఉంటే అరగంట పూజ చేస్తాను. మరీ బిజీగా ఉంటే నేను ప్రయాణిస్తున్న కారులోనే పూజ చేసేస్తాను. నా చేతికి రకరకాల తాళ్లు ఎప్పుడూ ఉంటాయి, అవన్నీ ఎవరో ఒక స్వామీజీ కట్టినవే. అదేవిధంగా, నా చేతికి ఉంగరాలు ఉండటం కూడా సెంటిమెంట్ గానే భావిస్తాను. ఇక, షూటింగ్ సమయంలో నా తలకు కట్టుకునే బ్యాండ్ గురించి చెప్పాలంటే... నా రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఎండగా తీవ్రంగా ఉండడంతో.. చిత్ర యూనిట్‌లో ఒక వ్యక్తి వచ్చి నా నుదురుకు ఎండతగలకుండా కట్టుకోమని ఒక క్లాత్ ఇచ్చారు. ''నీ ఫోర్ హెడ్ పెద్దది. ఎండ బాగా తగులుతుంది. ఇది కట్టుకో'' అని అన్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పద్ధతినే ఫాలో అవుతున్నాను. నా కన్నా ఎక్కువగా నా తలకు కట్టుకునే బ్యాండ్ ఫేమస్ అయిపోయింది'' అని కోడి రామకృష్ణ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments