Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడు పృథ్వీపై వేధింపుల కేసు : మహిళ ఫిర్యాదుతో

''30 ఇయర్ ఇండస్ట్రీ'' డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పృథ్వీపై పోలీసు కేసు న‌మోదు చేశారు. పృథ్వీతనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కవిత అనే మహిళ బంజారా హిల్స్ పోలీసులను ఆ

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (08:51 IST)
''30 ఇయర్ ఇండస్ట్రీ'' డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పృథ్వీపై పోలీసు కేసు న‌మోదు చేశారు. పృథ్వీతనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కవిత అనే మహిళ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన కవిత(30) బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నటుడు పృథ్వీరాజ్ కార్యాలయంలో రిసెప్షనిస్టుగా చేరింది. అప్పటికే పెళ్లయిన కవిత భర్తకు విడాకులు ఇచ్చి పృథ్వీతో కొంతకాలం సహజీవనం చేశారు. తనను వివాహం చేసుకుని నాలుగేళ్లపాటు కాపురం చేసి నమ్మించి మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం బిజీ క‌మెడియ‌న్‌గా వెలుగొందుతున్నపృథ్వీ తనదైన శైలిలో డైలాగ్‌లు పలికిస్తాడు. ఖడ్గం చిత్రంలో ''30 ఇయర్స్ ఇండస్ట్రీ'' అంటూ ఆయన చెప్పిన మేనరిజం డైలాగ్ బాగా పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు పృథ్వీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments