Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - శంకర్ మూవీపై లేటెస్ట్ అబ్‌డేట్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (12:25 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ టాలీవుడ్ ఏసీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చనున్నారనే వార్త గురువారం ఒకటి వెలువడింది. ఇపుడు మరో వార్త వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఈమె గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. చరణ్‌తో ఆమె జోడీ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది.
 
నిజానికి దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం  ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments