Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో అలా తప్ప ఇంకెలాగైనా నటిస్తానంటున్న కీర్తి సురేష్

కీర్తి సురేష్. అటు తెలుగు, ఇటు తమిళ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్. అజ్ఞాతవాసి సినిమాతో ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్‌. తన చేతిలో 4 సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. అంతేకాదు అప్పుడప్పుడు గ్యాప్ దొరికి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (14:52 IST)
కీర్తి సురేష్. అటు తెలుగు, ఇటు తమిళ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్. అజ్ఞాతవాసి సినిమాతో ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్‌. తన చేతిలో 4 సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. అంతేకాదు అప్పుడప్పుడు గ్యాప్ దొరికితే షో రూంల ప్రారంభోత్సవంలో బిజీగా పాల్గొంటోంది. రెండు చేతులా బాగా సంపాదిస్తోంది.
 
గత రెండురోజులకు ముందు ఒక టివి ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ రంగంలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అని యాంకర్ అడిగితే నాకు నచ్చిన హీరో అనడం కన్నా నాకు దేవుడితో సమానం మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిరు సినిమాలు బాగా ఫాలో అయ్యేదాన్ని. 
 
భాష తెలియకపోయినా చిరు యాక్టింగ్ అంటే మాత్రం చచ్చేంత ఇష్టం. చిరంజీవి సినిమాలను ఎన్నోసార్లు స్నేహితులతో కలిసి చూశాను. తెలుగు చిత్ర సీమలో చిరంజీవి నిజంగానే దేవుడు. ఆయన యాక్టింగ్ అద్భుతం... అనిర్వచనీయం. నేను మాటల్లో చెప్పలేను. చిరుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది. హీరోయిన్‌గా కాదు. ఆయనకు చెల్లెలిగానో, లేకుంటే కుమార్తె గానో నటించాలని కోరిక నాకుంది అంటోంది కీర్తి సురేష్‌. చిరంజీవిని దేవుడిలా, తండ్రిలా భావిస్తూ ఉంటానని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments