'షారుఖ్‌తో పనిచేయడం నాకు ఎప్పుడు ఇష్టమే' : కరణ్ జోహార్
షారుఖ్ ఖాన్, దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కి మంచి స్నేహసంబంధం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. నాకు షారుఖ్ ఫ్యామిలీ కంటే ఎక్కువ అని కరణ్ జోహార్ అంటున్నాడంటే... వారి మధ్య రిలేషన్‌ని ఇట్టే అర్ధంచేసుకోవచ్చు.
షారుఖ్ ఖాన్, దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కి మంచి స్నేహసంబంధం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. నాకు షారుఖ్ ఫ్యామిలీ కంటే ఎక్కువ అని కరణ్ జోహార్ అంటున్నాడంటే... వారిమధ్య రిలేషన్‌ని ఇట్టే అర్ధంచేసుకోవచ్చు. ఇరవై ఏళ్లకు పైగా షారుఖ్-కరణ్‌ల మధ్య బంధం ఉంది. 'షారుఖ్‌తో పనిచేయడం నాకు ఎప్పుడు ఇష్టమే' అని కరణ్ ఎప్పుడూ అంటుంటారు. కాగా కరణ్ చాలా కాలం తర్వాత ''యే దిల్ హై ముష్కిల్'' చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారనున్నాడు.
చాలాకాలం తరువాత రూపొందిస్తున్న చిత్రంకావడంతో ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ప్రత్యేక పాత్రలో నటింపజేస్తూ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇందులో ప్రత్యేకపాత్రలో నటించేందుకు మరో అగ్రహీరోని కూడా కరణ్ ఎంపిక చేసుకున్నారు. మొదట సైఫ్ అలీఖాన్‌ను సంప్రదించగా ఆయన ఒప్పుకున్నారు.
లండన్‌లో ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో సైఫ్ నటించారు. కానీ సైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ''కాల కంటి'' చిత్రం సినిమా షూటింగ్‌లో ఆయనకు గాయం కావడంతో ఈ సినిమాలో ఆయన నటించలేకపోయారు. దీంతో ఆయన పాత్రలో నటించడానికి షారుఖ్‌ను ఒప్పించాడు కరణ్. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంతోనే ఈ పాత్ర చేయడానికి షారుఖ్ ఒప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.