Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఓ పెద్ద ఫ్లాప్ హీరోనే కాదు.. బడా ఛీటర్ కూడా : సినీ విమర్శకుడు కేఆర్కే

కోట్లాది మంది అభిమానులకేకాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆరాధ్యంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) సంచలన విమర్శలు చేశారు.

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (14:42 IST)
కోట్లాది మంది అభిమానులకేకాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆరాధ్యంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) సంచలన విమర్శలు చేశారు. పవన్ ఓ పెద్ద ఫ్లాప్ హీరో అని.. ఇపుడు ఓ బడా ఛీటర్‌గా మారిపోయాడంటూ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
లోగడ పవన్ నటించిన చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో పలువురు పంపిణీదారులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. ఇదే అంశంపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కగా, వారికి సినీ ప్రముఖులు సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కాటమరాయుడు' చిత్రంతో మరోమారు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టారు. అయితే పవన్ కల్యాణ్ మోసగాడని బాలీవుడ్ వివాదాల నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ ఓ పెద్ద ఫ్లాప్ హీరో అని, ఫ్లాప్ హీరోనే కాకుండా ఇప్పుడు పెద్ద మోసగాడు అయిపోయాడని మండిపడ్డాడు. 
 
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్‌ను పవన్ రూ.8 కోట్లకు మోసం చేస్తున్నాడని ట్వీట్ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న నిరాహార దీక్ష ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన కమాల్.. ‘‘ఓ ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల రూ.2 కోట్లు నష్టపోయాడు. ఆ సినిమా ఓ అట్టర్ ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఆ సినిమాకు గానూ నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు’’ అంటూ పోస్ట్ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments