Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్ అంటే ఇష్టం.. అందుకే ఒప్పుకున్నా : కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్.. ఒకపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. కుర్రకారు హీరోయిన్ల ప్రవేశంతో ఆమె హవా తగ్గిపోయింది. ఇపుడు అడపాదడపా మాత్రమే సినీ అవకాశాలు ఉన్నాయి. అయితే, తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నట్

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (12:46 IST)
కాజల్ అగర్వాల్.. ఒకపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. కుర్రకారు హీరోయిన్ల ప్రవేశంతో ఆమె హవా తగ్గిపోయింది. ఇపుడు అడపాదడపా మాత్రమే సినీ అవకాశాలు ఉన్నాయి. అయితే, తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నట్టు నిరూపించుకునేందుకు ఐటమ్ సాంగ్‌లో కూడా నటించేందుకు సమ్మతించింది. ఇది అపుడు చర్చనీయాంశమైంది.
 
'జనతా గ్యారేజ్' సినిమాలో 'పక్కాలోకల్' పాట ఎంత హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 చార్ట్‌బస్టర్లలో ఆ ఐటెం సాంగ్ టాప్‌లో నిలిచింది. అయితే ఆ పాట తర్వాత మరో ఐటెం సాంగ్‌కు కాజల్ ఒప్పుకోవట్లేదు. ఐటెం సాంగ్ కోసం ఎన్ని ఆఫర్లు వచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించేస్తున్నారు. దానిపై కాజల్ వివరణ ఇచ్చారు. 
 
"నిజమే.. నాకు ఐటెం సాంగ్ ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయి. సినిమాల్లో వచ్చే ఆ ఐటెం పాటలకు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో వాటికి నో చెప్పేశాను. కానీ, పక్కాలోకల్ పాటకు జనతాగ్యారేజ్‌లో ఓ ప్రాధాన్యం ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. అందుకే తారక్ అడిగితే కాదనలేకపోయా. కేవలం తారక్ కోసమే ఆ పాట చేశాను" అని కాజల్ వివరణ ఇచ్చారు. కాగా, 'క్వీన్' రీమేక్ చిత్రంలో నటించేందుకు కాజల్ సమాయత్తమవుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments