Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాన హీరో కోసం జాన్వీని బుక్ చేసిన త్రివిక్రమ్?!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (12:21 IST)
టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కథా రచయితగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ మాటల మాంత్రికుడు ఇపుడు స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఈయన ఓ సినిమా చేస్తున్నారంటే.. అది సూపర్ హిట్ కావడం ఖాయమని ముందుగానే ముద్రపడిపోతుంది. అలాంటి స్టార్ డైరెక్టర్‌కు కూడా ఓ అభిమాన హీరో ఉన్నాడు. 
 
ఆయన జూనియర్ ఎన్టీఆర్. తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే స్వయంగా కూడా చెప్పారు. అలాంటి హీరో కోసం అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను బుక్ చేశారు. అంటే.. తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లలో జాన్వీని ఓ హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
కాగా, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రంరానుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో 30వ చిత్రం. అందుకే, ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో వారిద్దరూ ఉన్నారు. ఈ చిత్రం నవంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే యేడాది సమ్మర్‌కు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇందులో హీరోయిన్లుగా శృతిహాసన్, జాన్వీకపూర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌తో శృతిహాసన్ "రామయ్యా వస్తావయ్యా" అనే చిత్రంలో నటించింది. కానీ, జాన్వీ కపూర్ మాత్రం ఇదే తొలిసారి. మరోవైపు, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది. అయితే, ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments