Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్న కోలీవుడ్ దర్శకుడు!!

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (11:24 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. అయితే, ఈ వార్తపై ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు నెల్సన్ దిలీప్ కుమార్‌ల వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నారు. 
 
ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌ను పెంచుకునే ప్లానింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇతర భాషల్లోని టాప్ దర్శకుల కాంబోలో ఎన్టీఆర్ వరుస సినిమాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో "వార్ 2" సినిమాను జూనియర్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమా లైన్‌లో ఉంది.. ఈ చిత్రం ఓపెనింగ్ కూడా జరిగింది. 
 
తదుపరి తమిళ టాప్ దర్శకుడు నెల్సన్ కాంబోలో సినిమా ఉంటుందన్నది సమాచారం. "దేవర" సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైనా.. దర్శకుడు కొరటాల కావటం తెలుగులో మినహా ఎక్కడ సరైన బజ్ రాలేదు. 
 
తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్‌కున్న క్రేజ్ వల్ల రెవిన్యూ కనిపించింది కానీ.. ఇతర భాషల్లో ఆశించిన వసూళ్లు కూడా 'దేవర' అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా ఇతర భాషల మార్కెట్‌పై దృష్టిసారించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 
 
ఈ క్రమంలోనే ఇతర భాషల్లోని టాప్ ఫిలింమేకర్స్ కాంబోలో సినిమాలను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. నెల్సన్ ఎన్టీఆర్‌ల సినిమాను హంబోలే ఫిలిమ్స్ లేదా హారికా హాసినీ సంస్థల్లో ఒకటి నిర్మించే అవకాశముందని తెలుస్తొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments