Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

Advertiesment
devara still

ఠాగూర్

, ఆదివారం, 6 అక్టోబరు 2024 (11:43 IST)
అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమాలు, వారు రుణాన్ని ఈ జన్మకు తీర్చుకోలేనని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం "దేవర". గత నెల 27వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సినిమా రెండోవారంలోకి అడుగుపెట్టినా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు దసరా సెలవులు 'దేవర'కు బిగ్గెస్ట్ అడ్వాంటేజీగా మారాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'దేవర', 'వర'గా చేసిన ద్విపాత్రాభినయానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
 
ఇదిలావుంటే, ఈ చిత్రానికి సంబంధించి బ్లాక్బస్టర్ జర్నీ ఆఫ్ దేవర పేరుతో ఓ ప్రమోషనల్ వీడియో విడుదలైంది. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ప్రీరీలీజ్ వేడుక క్యాన్సిల్ కావడంతో అభిమానులను కలుసుకోలేకపోవడం తనకు చాలా బాధగా వుందని ఎన్టీఆర్ అన్నారు.
 
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ 'ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ తర్వాత అభిమానుల కోసం మరో వేడుక పెట్టాలని అనుకున్నాం ఎందుకంటే.. అభిమానులు నన్ను చూడటం కంటే వాళ్లను నేను చూడటం నాకు ఆనందం. నా అభిమానులతో ఎలాగైనా కలవాలి.. లేదంటే నాకు వెలితిగా వుంది. ఎలాగైనా వాళ్లతో సక్సెస్ పార్టీ పెట్టాల్సిందే అనుకున్నాను. కానీ దేవి నవరాత్రుల వల్ల బహిరంగ వేడుకలకు అనుమతులు రాలేదు. అభిమానులతో నాది ఎప్పుడూ విడదీయలేని అనుబంధం.
 
వాళ్లతో నా జర్నీ ఎంతో మధురం. నన్ను సినీ పరిశ్రమలో 24 ఏళ్లు మోశారు అభిమానులు. అది నెవర్ బి రీపెయిడ్. దేవర మీద కురిపించిన ప్రేమకు, నామీద కురిపించిన ప్రేమకు ఈ జన్మలో వాళ్ల రుణం తీర్చుకోలేను. కాకపోతే అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా చేయడం నా బాధ్యత. నిరంతరం నేను దానికోసమే ప్రయత్నిస్తాను. మీకు జీవితాంతం రుణ పడి వుంటాను' అంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌