Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డితో జాన్వీ కపూర్.. (video)

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:52 IST)
అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 
 
ఇందులో భాగంగా శ్రీదేవీ కుమార్తెను విజయ్ సరసన నటింపజేస్తే.. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పూరీ యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఛార్మి.. జాన్వీతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు. 
 
ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్‌లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని, అతడి కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పింది. మరి ఆ ఛాన్స్‌ ప్రస్తుం ఆమె ఇంటి తలుపు తడుతోంది. మరి ఈ ఛాన్సును జాన్వీ ఉపయోగించుకుని టాలీవుడ్ తెరంగేట్రం చేస్తుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments