తమిళ వెండితెరపై "జీన్స్" కాంబినేషన్ రిపీట్??

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (18:17 IST)
తమిళ హీరో ప్రశాంత్ - బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ నటించిన చిత్రం జీన్స్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డులను నెలెకొల్పింది. మంచి వినోదాన్ని ఇస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీజంట మరో సినిమాలో కనువిందు చేసే అవకాశం కనిపిస్తోంది.
 
హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో నెగటివ్ టచ్‌తో కూడిన ఓ కీలక పాత్ర వుంది. హిందీలో సీనియర్ నటి టబు ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు తమిళంలో ఈ పాత్రకు గానూ ఐశ్వర్య రాయ్‌ని సంప్రదిస్తున్నారట.
 
ఈ విషయంలో ప్రస్తుతం ఐశ్వర్యతో సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే, ఆమె నుంచి ఇంకా నిర్ణయం రాలేదనీ చిత్ర నిర్మాత, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ చెప్పారు. ఐశ్వర్య అయితే ఆ పాత్రకు బాగా సూటవుతుందని, సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆయన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలావుంచితే, తెలుగులో ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు వెర్షన్లో ఆ కీలక పాత్రను తమన్నా పోషిస్తోంది. త్వరలోనే ఈ తెలుగు వెర్షన్ షూటింగ్ మొదలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments