తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ... విజయాల్ని సొంతం చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ అంజలి. తమిళ హీరో జై, అంజలి ప్రేమించుకుంటున్నారు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్
తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ... విజయాల్ని సొంతం చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ అంజలి. తమిళ హీరో జై, అంజలి ప్రేమించుకుంటున్నారు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జై పుట్టినరోజును అంజలి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. జై షూటింగ్ జరుగుతున్న స్పాట్‌కి వెళ్లి బర్త్ డే విషెస్ తెలియచేసి సర్‌ఫ్రైజ్ చేసింది.
ఇద్దరు ఒకే అపార్టెమెంట్లో ఉండేవారు. అయితే.... ఏమైందో ఏమో కానీ ఆతర్వాత అంజలి జై తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటూ మాట మార్చేసింది. ఇదిలా ఉంటే... ఈనెల 17న అంజలి పుట్టినరోజు. చాలా మంది సినీ ప్రముఖులు అంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కానీ... జై మాత్రం ట్విట్టర్లో కానీ, ఫేస్‌బుక్‌లోని బర్త్ డే విషెస్ తెలియచేయలేదు. వీళ్లిద్దరూ కలిసి బెలూన్ అనే సినిమా చేసారు. మరి... జై తనకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన అంజలి భవిష్యత్‌లో అతనితో కలిసి సినిమాల్లో అయినా నటిస్తుందో లేదో..?