ఆ పనికి 'గుడిలో.. బడిలో' పాప పూజా హెగ్డే ఉందిగా...!

'గుడిలో.. బడిలో' పాట ఎంత వివాదాన్ని తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా 'దువ్వాడ జగన్నాథం'లో నటించిన అల్లు అర్జున్ కన్నా అందులో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పేరే ప్రేక్షకుల నుంచి వచ్చింది. జీరో సైజ్ నడుముతో

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (14:46 IST)
'గుడిలో.. బడిలో' పాట ఎంత వివాదాన్ని తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా 'దువ్వాడ జగన్నాథం'లో నటించిన అల్లు అర్జున్ కన్నా అందులో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పేరే ప్రేక్షకుల నుంచి వచ్చింది. జీరో సైజ్ నడుముతో మిల్కీ బ్యూటీలా కనిపించే పూజా హెగ్డేకు ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ వైపు దృష్టిపెట్టిన పూజా హెగ్డే అక్కడా అవకాశాలు దొరకడం లేదు. దీంతో ఇక ఐటెం సాంగ్స్‌కు సిద్ధమైపోయింది పూజా.
 
రాంచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' సినిమాలో ప్రత్యేక ఐటం సాంగ్‌కు పూజా హెగ్డే నర్తించనుంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సినిమాలంటేనే గతంలో ఐటెం సాంగ్‌లు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ను చిత్రీకరించేందుకు దర్శకుడు సిద్ధమయ్యారు. 
 
అయితే సాంగ్‌లో ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు సుకుమార్‌కు పూజా హెగ్డే అయితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారట. దీంతో ఆమె అయితే ఇప్పుడు బాగుంటుందని సుకుమార్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారట. దీంతో ఫోన్‌లో పూజాను సుకుమార్ సంప్రదిస్తే నేను ఐటం సాంగ్ చేస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఐటెం గర్ల్‌గా పూజా హెగ్డే రంగస్థల సినిమాలో అందాలను ఆరబోయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments