Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగస్థలం 1985లో కరీనా కపూర్ స్టెప్పులు.. పవన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్?

మగధీర... రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా దసరాకు ఈ చిత్రం ఫస్ట్ లుక

Advertiesment
రంగస్థలం 1985లో కరీనా కపూర్ స్టెప్పులు.. పవన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్?
, సోమవారం, 25 సెప్టెంబరు 2017 (17:09 IST)
మగధీర... రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా దసరాకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఐటమ్ సాంగ్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
బాలీవుడ్‌లో హీరోయిన్‌గానే  కాకుండా ఐటమ్ గర్ల్‌గా మంచి మార్కులు వేసుకున్న ఈ ముద్దుగుమ్మను ఎలాగైనా రంగస్థలంలో స్టెప్పులు వేయించాలని దర్శకుడు సుకుమార్ మల్లగుల్లాలు పడుతున్నారట. స్కిప్ట్ర్ ప్రకారం కరీనా సాంగ్ ఈ చిత్రంలో వుంటే తప్పకుండా సినిమా బంపర్ హిట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా ఐటమ్ గర్ల్ రేసులో ప్రియాంకా చోప్రా కూడా వున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఈ సినిమా ఫస్ట్ లుక్ దసరాకు రానుంది. హైదరాబాదు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పవర్ స్టార్ విడుదల చేస్తారని.. దసరాకు చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ అవుట్ అవుతుందని టాక్. ఈ సినిమాలో చెర్రీ సరసన తొలిసారి సమంత నటిస్తుంది. అనసూయ, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఓవర్.. నాతోనే డ్యాన్స్ రెడీ: ఉదయ భానుతో రేణు సెల్ఫీ (ప్రోమో వీడియో)