Webdunia - Bharat's app for daily news and videos

Install App

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

దేవీ
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (09:21 IST)
Sandeep- charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను, ప్రేక్షకులను నిరాశపరిచిన చిత్రం శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్. దాన్ని ద్రుష్టిలో పెట్టుకుని అభిమానుల సలహాలు బేరీజువేసి బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో వున్నాడు రామ్ చరణ్. 
 
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తో కలిసి పనిచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి UV క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువి క్రియేషన్స్ పై అనుష్క నటించి ఘాటీ సినిమా విడుదలకాబోతుంది. ఈ సినిమా బిజినెస్ పరంగా కాస్త ఆలస్యమవుతోంది.
 
సందీప్ రెడ్డి వంగా చిత్రం రామ్ చరణ్ తో త్వరలో ప్రకటన వెలువరించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ దర్శకుడు రాబోయే చిత్రం స్పిరిట్ విత్ ప్రభాస్ హైప్‌ను మరింత పెంచింది. ప్రభాస్ కొంత గేప్ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం మేరకు పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే పెద్ద సినిమా ఇదే కావచ్చు. సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడినట్లే. ఇక వంగా దర్శకత్వంలో చరణ్ సినిమా వుంటేగనుక అది అంతర్జాతీయ లెవల్ లో వుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నా వదలిపెట్టని కామాంధులు...

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments