Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్‌తో ప్రేమలోపడిన కేరళ కుట్టి!!

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (12:04 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న  కేరళ హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. ఈమెకు మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వరించాయి. అయితే, ఈమె భారత క్రికెట్ జట్టుకు చెందిన యువ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్, వన్డే, ట్వంటీ20 సిరీస్‌ల నుంచి బుమ్రా తన వ్యక్తిగత కారణాలతో వైదొలగాడు. పెళ్ళి కోస‌మే బుమ్రా మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడ‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం న‌డుస్తుంది. బీసీసీఐ వర్గాలు కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలిపాయి. అయితే బుమ్రా పెళ్లి చేసుకోబోయే మ‌హిళ ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడుస్తుంది.
 
కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బుమ్రా వివాహం జ‌ర‌గ‌నుందంటూ నెటిజ‌న్స్ జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. కొన్నాళ్ళుగా వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని, బుమ్రా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలో అయ్యే ఒకే ఒక్క హీరోయిన్ అనుప‌మ‌నే కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో రిలేష‌న్ ఉంద‌నే అభిప్రాయానికి నెటిజ‌న్స్ వ‌చ్చారు. 
 
అనుప‌మ కూడా ప‌లుమార్లు త‌న‌కు బుమ్రా అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. మ‌రి అనుప‌మ‌ని బుమ్రా పెళ్ళి చేసుకోబోతున్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. అలాగే, అనుపమ ప్రేమలో ఉన్న క్రికెటర్ ఎవరో కూడా తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments