హీరోయిన్ పాత్రలకు దూరంగా కోహ్లీ సతీమణి??

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:35 IST)
బాలీవుడ్‌లోని అగ్ర నటీమణుల్లో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఒకరు. ఈమె ఇప్పటికే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. 
 
లాక్డౌన్ సమయంలో నిర్మించిన 'పాతాళ్ లోక్' సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్‌కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఇదిలావుంటే, అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. హీరోయిన్ పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తోందనేది బీటౌన్ టాక్. 
 
2018లో విడుదలైన 'జీరో' సినిమా తర్వాత  అనుష్క పూర్తి స్థాయి పాత్రను ఇంత వరకు పోషించకపోవడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments