Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్డేట్ : అల్లూరికి - కొమరం భీంకు గురువు ఎవరంటే?

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (17:27 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు హీరోలుగా కాగా, అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించే నటీనటుల పుట్టిన రోజుల్లో చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్లను రిలీజ్ చేస్తోంది. 
 
ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కోమరం భీమ్‌ల టీజర్స్ రిలీజ్ చేసిన "ఆర్ఆర్ఆర్" టీమ్ మొన్నా మధ్య ఈ సినిమాలో రామరాజుకి జంటగా సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ లుక్‌ని రిలీజ్ చేశారు. 
 
ఇక తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసి మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికుల భారీకి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇలాంటి సర్‌ప్రైజ్ మళ్ళీ మే 20వ తేదీన రాబోతుందని అందరూ అనుకుంటుండగానే అంత దూరం ఎందుకు జస్ట్ త్రీ డేస్ ఆగండి మరో సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నామంటున్నారట రాజమౌళి బృందం. 
 
ఈ త్రీడేస్‌లో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ఏముంది అని అందరూ ఆలోచనలోపడ్డారు. అయితే మరో మూడు రోజుల్లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ పుట్టినరోజు రాబోనుంది. అందుకే 'ఆర్ఆర్ఆర్' నుంచి అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్బంగా ఏప్రిల్ 2వ తారీకున పోస్టర్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
 
'ఆర్ఆర్ఆర్‌'లో అజయ్ దేవగన్ కొమురం భీమ్ మరియు అల్లూరికి గురువుగా కనిపించబోతున్నట్లు సమాచారం. మరి భీమ్, రామరాజులతో ఉన్న అజయ్ దేవగన్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తారా లేక కేవలం అజయ్ దేవగన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments