Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (16:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింకీకి రీమేక్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైది. ఇందులోభాగంగా, సోమవారం సాయంత్రం ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 
 
నిజానికి వకీల్ సాబ్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాతలు పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. ఊహించని విధంగా.. అభిమానులకి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా ప్రమోషన్స్‌ని పీక్స్‌లో నిర్వహిస్తున్నారు. 
 
ఇప్పటికే వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు నగరాలలో బెలూన్స్‌ని ఎగురవేశారు. ఒక్కో బెలూన్ ఖర్చు 30 వేల రూపాయలని తెలుస్తోంది. అలాగే దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సహా చిత్ర యూనిట్ వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలని రివీల్ చేస్తూ అంచనాలు మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 
 
కాగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ థియోట్రికల్ ట్రైలర్ రేపు సాయంత్రం 6గం.లకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. 
 
తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్‌లో.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments