Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - క్రిష్ మూవీ విరూపాక్షిలో ఇంట్రస్టింగ్ సీన్ ఇదే

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (18:43 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అభిమానులు సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేయడం.. తెలిసిందే. అభిమానులు, అన్నయ్య చిరంజీవి ఒత్తిడి చేయడంతో పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాను ఎనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు.
 
ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తారనుకుంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ కాకుండానే.. క్రిష్‌తో మూవీని ఎనౌన్స్ చేసారు. ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
 
అది ఏంటంటే.. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో చనిపోతుందని.. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలిసింది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు క్రిష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే వకీల్ సాబ్ చిత్రంలోనిదంటూ ఓ స్టిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. చూడండి ఇది...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments